ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఉచిత హలీమ్‌(Halim) ఆఫర్ ను ప్రకటించింది. ఫ్రీ హలీం అంటే వందలాది మంది దూసుకు వచ్చారు. ఫలితంగా హోటల్ వద్ద జనం రద్దీతో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్భంగా మలక్ పేట పరిధిలోని ఆ హోటల్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది.ఉచిత హాలీమ్ ఆఫర్ గురించి హోటల్ యాజమాన్యం పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. వారు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)