ఓ ద్విచక్ర వాహనంపై 117 చలానాలు పెండింగ్‌లో ఉండటం చూసి పోలీసులే నివ్వెరపోయారు. భారీ స్థాయిలో చలాన్లు (Hyderabad man caught with 117 unpaid challans) ఉండడంతో వెబ్‌ పోర్టల్‌ పేజీ కూడా సరిపోలేదు. ఆబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌ (Mohammed Farid Khan) పేరుతో (ఏపీ09ఏయూ1727) హోండా యాక్టీవా ఉంది. మంగళవారం మధ్యాహ్నం నాంపల్లి స్టేషన్‌ రోడ్డులోని కలెక్టర్‌ కార్యాలయం గుండా వెళ్తుండగా, ట్రాఫిక్‌ పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

ఆ వాహనంపై 117 చలాన్లు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. రూ. 29 వేల జరిమానా చెల్లించాల్సి ఉంది. దీంతో పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేశారు. 2014 నుంచి వాహనంపై చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్ల వెబ్‌పోర్టల్‌ పేజీలో కేవలం 75 చలాన్ల వరకే కనిపిస్తాయి. పోలీసులు సాంకేతికత సహాయంతో పూర్తి చలాన్లను గుర్తించారు. హెల్మెట్‌,మాస్క్‌, నో పార్కింగ్‌లో నిలుపుతూ.. సదరు వాహనదారుడు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. రూ. 30 వేల పెండింగ్‌ చలానాలు ఉండటంతో వాహానాన్ని సీజ్‌ చేశారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)