ఇండిగోకు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న విమానం టాయిలెట్‌లో బెదిరింపు లేఖ కన్పించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పుర్ (Nagpur)లో అత్యవసరంగా దించేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ సిబ్బంది, అంబులెన్స్‌లను విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు. ప్రయాణికులను దించి వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. విమానంలో 69 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను బస్సులో హైదరాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా నలుగురు యువకులు మృతి
Here's ANI News
Flight 6E 7308 operating from Jabalpur to Hyderabad was diverted to Nagpur due to a bomb threat. Upon landing, all passengers were disembarked and mandatory security checks were promptly initiated..." IndiGo pic.twitter.com/X8VUnGV6dZ
— ANI (@ANI) September 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)