లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై కేసు నమోదైన సంగతి విదితమే. దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్‌ స్పందించింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో సభ్యులైన జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు అందిందని ఫిలిం ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

వీడియో ఇదిగో, సెక్స్‌ కోరిక తీర్చాలంటూ జానీ మాస్టర్ నన్ను దారుణంగా..మాట వినకపోతే ఆఫర్లు రావంటూ..

దానిని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌కు సిఫార్సు చేసిట్లు తెలిపారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయిన తర్వాత POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందన్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితురాలి ఫోటోలను, వీడియోలను దయచేసి ఎవరూ ఉపయోగించవద్దని కోరారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)