అవినీతి సొమ్మును నీటి పైపుల్లో దాచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని కల్బుర్గి ప్రాంతానికి చెందిన ప్రజా సంబంధాల అధికారి ఇంట్లో వెలుగులోకి వచ్చిన దృశ్యం ఇది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో వివరాల్లోకెళితే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి 15 మంది అధికారులకు చెందిన నివాసాలపై కర్ణాటక అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం రైడ్లు జరిపింది. 60 చోట్ల సోదాలు నిర్వహించింది.
ఇందులో భాగంగా కల్బుర్గి జిల్లాలోని పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజనీర్ శాంతగౌడ్ బిరాదార్ ఇంటిపై అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా కేవలం డబ్బులు దాచేందుకు ఒక పైప్ లైన్‌ను ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ పైపును కత్తిరించి తెరవగా బోరు బావి నుంచి నీళ్లు వచ్చినట్లు నోట్ల కట్టలు రావడం ప్రారంభమైంది.
పైపులో నుంచి వస్తున్న డబ్బును బకెట్లలో పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అనంతరం సదరు అధికారిపై చర్యలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా శాంతగౌడ్ బిరాదార్ ఇంటి నుంచి రూ.25 లక్షల నగదు, భారీగా బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)