తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ ప్రాంతం జెఎన్ టియుహెచ్ కాలేజీలోని క్యాంటీన్‌లో చట్నీ పాత్రలో ఎలుక కనిపించింది. మూత పెట్టకపోవడంతో చట్నీలో ఎలుక పడింది. చట్నీలో ఎలుక పరుగులు తీయడం చూసిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహ స్పందించారు. తినేందుకు తయారు చేసిన చట్నీలో ఎలుక పడలేదని, శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక పడిందని వివరణ ఇచ్చారు. పాత్రలో ఉన్న ఎలుకను తీసి వైరల్ చేశారన్నారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డారు. వీడియో ఇదిగో, పూరీ కూరలో ప్రత్యక్షమైన పురుగు, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, హోటల్ యజమాని స్పందన ఏంటంటే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)