ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)బుధవారం ఢిల్లీలోని కరావల్ నగర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వేదికపైకి చేరుకున్న తర్వాత, బీజేపీకి చెందిన వివిధ నియోజకవర్గాల అభ్యర్థులను ఆయనతో కలవడానికి ఆహ్వానించారు.
ఈ క్రమంలో పట్పర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగీ(Ravinder Negi) ప్రధాని వద్దకు వెళ్లారు. రవీంద్ర సింగ్ ప్రధాని మోదీ కాళ్లు తాకేందుకు ప్రయత్నించగా, మోదీ వెంటనే ఆపారు. ఆశ్చర్యకరంగా మోదీనే స్వయంగా రవీంద్ర సింగ్ నేగీ కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో మోదీ రవీంద్ర నేగీని తన కాళ్లు తాకకుండా ఆపే ప్రయత్నం చేయడం ఆ తర్వాత తానే ఆయన కాళ్లు తాకడం స్పష్టంగా కనిపించింది. దీంతో ప్రధానమంత్రి మోదీపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ గొప్పతనానికి ఇది నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలు చేశారు మోదీ. నేడు మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సూక్తులను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో షేర్ చేయండిలా..
PM Narendra Modi bows feet of BJP MLA candidate Ravinder Negi
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీందర్ నేగి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..@narendramodi @PMOIndia @ravinegi4bjp pic.twitter.com/R9hDkWF0fu
— Telangana Awaaz (@telanganaawaaz) January 30, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)