ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా నేటితో 25వ రోజుకు చేరింది. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర పుణ్యస్నానం ఆచరించిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా మహా కుంభమేళాలో అల్లు అర్జున్ పుష్ప 2 గెటప్‌తో సందడి చేశాడు ఓ అభిమాని. తగ్గేదేలే అంటూ అచ్చు గుద్దినట్టు పుష్పరాజ్‌ను దించేశాడు. ఇక ఆ వ్యక్తితో సెల్ఫీలు దిగేందుకు అంతా పోటీ పడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా ఇప్పటివరకు 40 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 26 శివరాత్రితో మహా కుంభమేళా ముగియనుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.
Pushpa 2 Allu Arjun fan buzz in Prayagraj Maha Kumbh Mela!
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో కూడా 'తగ్గేదేలే'..!
'పుష్ప 2' అల్లు అర్జున్ గెటప్‌లో సందడి చేసిన అభిమాని pic.twitter.com/ZqnEcuRpqa
— BIG TV Breaking News (@bigtvtelugu) February 6, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)