Newdelhi, May 27: తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామితో (Spouse) ఎక్కువ కాలం శృంగారానికి (Sex) నిరాకరించడం మానసిక క్రూరత్వం (Mental Cruelty) కిందికే వస్తుందని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు తన విడాకుల అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. తనకు 1979లో వివాహమైందని, కొంత కాలం తర్వాత తన భార్య తనతో కలిసి జీవించేందుకు నిరాకరించిందని రవీంద్ర యాదవ్ ధర్మాసనానికి తెలిపారు. దీనిపై ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ''పిటిషనర్ భార్యకు దాంపత్య బంధం మీద గౌరవం లేదు. ఆమె తన భర్తకు భార్యగా ఉండేందుకు సుముఖంగా లేదు. అందుకే వారి దాంపత్య జీవితం విచ్ఛిన్నమైంది'' అని వ్యాఖ్యానించింది. రవీంద్ర వివాహ బంధాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
Yoga Mahotsav: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’.. వీడియో ఇదిగో..
Refusing Sex To Spouse For Long Time "Mental Cruelty": Allahabad High Court https://t.co/LC6pdTrokM pic.twitter.com/lltHqMy1Dp
— NDTV News feed (@ndtvfeed) May 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)