Hyderabad, Jan 29: హైదరాబాదులో (Hyderabad) ఇటీవల తరచుగా రోడ్లు (Road) కుంగిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల గోషామహల్ (Goshamahal) లో రోడ్డు కుంగిపోయి వాహనాలు అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఘటనే హిమాయత్ నగర్ (Himayath nagar) లో తాజాగా చోటుచేసుకుంది. హిమాయత్ నగర్ లో నిత్యం రద్దీగా ఉండే స్ట్రీట్ నెం.5లోని రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ఓ టిప్పర్ అదుపుతప్పి ఆ గుంతలో పడిపోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు కుంగిపోవడంతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)