Newdelhi, Jan 12: కాలికట్ (Calicut) నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో మహిళా ప్రయాణికురాలు వీరాజైన్ కు చేదు అనుభవం ఎదురైంది. శాకాహార భోజనం అడిగిన ఆమెకు విమాన సిబ్బంది అదే ఇచ్చినా.. అందులో చికెన్ ముక్కలు ఉండడంతో ఆమె అవాక్కైంది. అంతేకాదు, వారు సర్వ్ చేసిన ఆహార పొట్లంపై ‘వెజ్ మీల్’ అని స్పష్టంగా రాసివుంది కూడా. దీంతో వెంటనే ఆమె ఆ ఫొటోలు తీసి సామాజిక మాధ్యమం ఎక్స్ లో షేర్ చేసింది. ఆమె పోస్టు వైరల్ అయి చర్చనీయాంశం కావడంతో స్పందించిన ఎయిర్ ఇండియా.. ఆ పోస్టును డిలీట్ చేయాలని, ఇలాంటి సున్నిత విషయాలను బహిరంగ పర్చవద్దని కోరింది. పీఎన్ఆర్ నంబర్ తో తమకు నేరుగా మెసేజ్ (డీఎం) చేయాలని అభ్యర్థించింది. ఎయిర్ ఇండియా కోరినట్టే డైరెక్ట్ మెసేజ్ చేసినప్పటికీ వారి స్పందన చాలా నాసిరకంగా ఉందని జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కేవలం క్షమాపణలు చెప్పి ఆ విషయాన్ని అక్కడితో ముగించారని పేర్కొన్నారు.
'Hurt my sentiments': #AirIndia passenger finds chicken in veg meal. Airline reactshttps://t.co/iaDWmDdw7u
— IndiaToday (@IndiaToday) January 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)