తెలంగాణలో భారీవర్షాలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం చిక్కుకుంది. చిక్కుకున్నవారిలో పిల్లలతో పాటు మహిళ, వృద్ధురాలు ఉన్నారు. వరద చుట్టుముట్టిన ఇంటి నుంచి రక్షించాలని బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వెంకటేశ్వరనగర్‌లో ఓ ఇంటిని మున్నేరు వరద చుట్టుముట్టింది. ఏడుగురు బాధితులు ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గణేశ్‌నగర్, దానవాయిగూడెం ప్రాంతాల్లోనూ చాలా ఇళ్లు నీట మునిగాయి. వీడియోలు ఇవిగో, హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్, రెండు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు
Here's Videos
ఖమ్మంలో మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది.
కరుణ గిరి వంతెన నుంచి మున్నేరు వాగును ఉప ముఖ్యమంత్రి భట్టి పరిశీలించారు.
మున్నేరు వాగులో నీటి ఉధృతి పెరగడంతో బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతించవద్దని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. pic.twitter.com/Cd1O7ndagX
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)