వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. వరంగల్ వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇప్పటికే రైళ్లు నిలిచిపోయాయి. అటు రైళ్లలో వెళ్లే మార్గం లేక, ఇటు బస్సులు కూడా నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత, ఐతవరం వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు

ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు కూడా నిలిచిపోగా... ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు విజయవాడ బస్టాండ్ లో ఇబ్బందులు పడుతున్నారు. ఇక మున్నేరు, కట్టలేరు, వైర వేరు ఉగ్రరూపం దాల్చడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. రెండు అడుగుల మేర హైదరాబాద్ విజయవాడ జాతి రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)