Buses submerged at Vijayawada (Credits: X)

Vij, Sep 1: వాయుగుండం తీరం దాటినప్పటికీ తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. రైల్వే ప్రయాణికులకు అలర్ట్,భారీ వర్షాలకు 30కి రైళ్ల రద్దు, మరికొన్ని ట్రైన్స్ దారి మళ్లింపు, లిస్టు ఇదిగో..

వరంగల్ వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇప్పటికే రైళ్లు నిలిచిపోయాయి. అటు రైళ్లలో వెళ్లే మార్గం లేక, ఇటు బస్సులు కూడా నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు కూడా నిలిచిపోగా... ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు విజయవాడ బస్టాండ్ లో ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కనీవినీ ఎరుగని వర్షం పడింది. ఒక్కరోజులో ఏకంగా 29 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ స్థాయిలో వర్షం కురవడం గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు కుండపోత వాన కురవడంతో సిటీలోని పలు కాలనీలు జలమయంగా మారాయి.

మరికొన్ని చోట్ల ఏకంగా వీధుల్లో నాలుగు అడుగుల మేర వరద నీరు చేరింది. శివార్లలోని కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇళ్లు నీటమునిగాయి. రైల్వేట్రాక్‌ అండర్‌ పాస్‌ వద్ద 4 బస్సులు నీట మునగగా క్రేన్ల సాయంతో అధికారులు వాటిని బయటకు తీశారు.