Jaipur, Jan 19: రాజస్థాన్ (Rajasthan) జైపూర్ (Jaipur)లో చిరుత (Leopard) హల్ చల్ చేసింది. కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేటు హోటల్ గది (Hotel Room)లోకి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది. దాదాపు రెండు గంటల పాటు చిరుత ఆ గదిలోనే గడిపింది. అయితే, ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిరుతను చూసిన హోటల్ యాజమాన్యం ఆ గదికి బయట నుంచి తాళం వేసి.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఎంతో చాకచక్యంగా చిరుత పులిని పట్టుకొని బోనులో బంధించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Salaar OTT Release: నేటి అర్ధరాత్రి 12 గంటలకు ఓటీటీలోకి సలార్.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
जयपुर के हैरिटेज होटल में घुसा लेपर्ड, टूरिस्ट होटल छोड़कर बाहर भागे, वीडियो हो रहा वायरल.#Jaipur #Leopard #viralvideo pic.twitter.com/2oIKzlIMMn
— Nidhi solanki🇮🇳 (@iNidhisolanki) January 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)