Vijayawada, Sep 1: వర్షాలతో (Rains) తెలుగు రాష్ట్రాలు (Telugu States) అతలాకుతలం అవుతున్నాయి. ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన నిర్లక్ష్య ప్రయాణంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నూజివీడు(మ) వెంకటాయపాలెంలో వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొందరు చిక్కుకున్నారు. వీరిని తాడు సాయంతో గ్రామస్థులు కాపాడే ఏర్పాట్లు చేశారు. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ఒక చేతితోనే తాడు పట్టుకోవడంతో అదుపుతప్పి అంతా చూస్తుండగానే కొట్టుకుపోయాడు. చివరకు చెట్ల మధ్య చిక్కుకున్న ఆయన్ను గ్రామస్థులు రక్షించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
AP: NTR జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. నూజివీడు(మ) వెంకటాయపాలెంలో వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొందరు చిక్కుకున్నారు. వీరిని తాడు సాయంతో గ్రామస్థులు కాపాడే ఏర్పాట్లు చేశారు. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ఒక చేతితోనే తాడు పట్టుకోవడంతో… pic.twitter.com/lxw028vrSh
— ChotaNews (@ChotaNewsTelugu) September 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)