ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ పసిపాపకు ఒక వ్యక్తి కరాటే నేర్పిస్తున్నాడు. దీనిలో భాగంగానే పాపతో కరాటే చేస్తూ ఆ టీచర్‌ ఓడిపోయాడు. పాప అతని చెయ్యి పట్టుకొని లాగగానే.. ఆ టీచర్ కింద పడిపోయాడు. ఇలా రెండు మూడుసార్లు కింద పడిన తర్వాత.. అతన్ని కుడి చెయ్యి పట్టుకొని వెనక్కు విరిచిందా పాప. దాంతో తను ఓడిపోయినట్లు ఆ టీచర్ అంగీకరించాడు. పాప కోసం ఆ టీచర్ అలా చేయడాన్ని చూసిన నెటిజన్లు.. అతన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోలో ‘కరాటే కిడ్’ చాలా ముద్దొచ్చేస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)