Suicide Threat on Metro Track: ఢిల్లీలో మెట్రో ట్రాక్ పైనుంచి దూకడానికి యత్నించిన యువతి.. ఆ తర్వాత?? (వీడియోతో)
న్యూఢిల్లీలో మెట్రో రైలు ట్రాక్ పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్ మెట్రో స్టేషన్ నుంచి ట్రాక్ పైకి ఓ యువతి వచ్చింది.
Newdelhi, Dec 12: న్యూఢిల్లీలో (Delhi) మెట్రో రైలు ట్రాక్ (Metro Track) పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్ మెట్రో స్టేషన్ (Shadipur Metro Station) నుంచి ట్రాక్ పైకి ఓ యువతి వచ్చింది. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ట్రాక్ రేలింగ్ పై కాలు పెట్టి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకోవాలనుకుంది. అయితే కింది నుంచి వెళ్తున్నవారు ఆమెను గమనించి వారించారు. దీంతో ఆమెను మాటల్లో పెట్టిన అధికారులు.. పోలీసులను ఆమె వద్దకు పంపించారు. క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు, మెట్రో సిబ్బంది ఆ యువతిని క్షేమంగా కిందికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
Watch: Woman Threatens To Jump Off Metro Track. What Happened Next https://t.co/A1EPxjsHl8 pic.twitter.com/7p5OvrSTxJ
— NDTV (@ndtv) December 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 12, 2023 09:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

