మనది మగాళ్ల రాష్ట్రం. అందుకే అత్యాచార కేసుల్లో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని స్వయానా మంత్రే అసెంబ్లీలో ప్రకటించాడు. రేప్‌ కేసుల్లో దేశంలోనే రాజస్థాన్‌ (Rajasthan) మొదటి స్థానంలో ఉందని ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరివాల్‌ అసెంబ్లీలో ( minister Shanti Dhariwal in assembly) ప్రకటించారు. మంత్రి వ్యాఖ్యలపై స్వపక్షంతో పాటు విపక్షంలోనూ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. మనం రేప్‌ కేసుల్లో మొదటి స్థానంలో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు.

మనం లైంగిక దాడి కేసుల్లో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నామంటే.. రాజస్థాన్‌ పురుషుల రాష్ట్రం’ అని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ధరివాల్‌ ప్రకటించారు. మంత్రి ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పునియా విరుచుకుపడ్డారు. మంత్రి ప్రసంగానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)