ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్-39లో పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ టైల్స్ కార్మికుడు యజమాని ఖరీదైన కారుకు నిప్పు పెట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన టైల్స్ కార్మికుడు రణ్‌వీర్.. నోయిడాలోని సదర్‌పూర్ కాలనీకి చెందిన ఆయుష్ చౌహాన్ ఇంట్లో టైల్స్ వేశాడు. ఇందుకు సంబంధించి రణ్‌వీర్‌కు ఆయుష్ రూ. 68 వేలు చెల్లించాల్సి ఉంది. ఎన్నిసార్లు అడిగినా వాయిదాలు వేస్తుండడంతో రణ్‌వీర్ విసిగిపోయాడు.
డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఆయుష్‌పై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగా మంగళవారం బైక్‌పై సదర్‌పూర్ కాలనీకి వచ్చిన రణ్‌వీర్.. ఇంటి బయట పార్క్ చేసిన ఆయుష్ బెంజ్ కారుపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆయుష్ చౌహాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రణ్‌వీర్‌ను అరెస్ట్ చేశారు.
#Noida मिस्त्री ने दिखाया बदला लेने की परम्परा है उसके यहाँ
मिस्त्री ने मर्सिडीज कार में आग लगा दी।
कार मालिक ने अपने घर में टाइल्स लगवाए लेकिन पैसे पूरे नहीं दिए थे।
मिस्त्री ज़रूर पूर्वांचल का होगा !#ViralVideo @Uppolice #UttarPradesh @myogiadityanath @PankajSinghBJP pic.twitter.com/nkX0PB4t4O
— Aviral Singh (@aviralsingh7777) September 14, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)