ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన వందేభారత్‌ రైలులో పైకప్పు నుంచి లోనికి నీరు చేరింది. సీట్లన్నీ తడిచిపోవడంతో ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడ్డారు.దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ ప్రయాణికుడు రైల్వే సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజా ఘటనపై ఉత్తర రైల్వే స్పందించింది. నీరు లోనికి రావడానికి గల కారణాన్ని వివరించింది. ‘‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. నీటి పైపులు తాత్కాలికంగా మూసుకుపోవడంతోనే ఈ విధంగా జరిగింది. నీరు లోనికి చేరింది. ఇలాంటి తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని ఓ ప్రకటనలో ప్రయాణికులను క్షమాపణలు కోరింది.  వీడియో ఇదిగో, వందే భారత్ రైలు పైకప్పు నుండి నీరు లీక్, వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేసేవా

Here's Video 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)