Ahmedabad, Nov 19: మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ లో (Ahmedabad) వన్డే ప్రపంచ కప్ ఫైనల్ (World Cup Final) మ్యాచ్ జరుగనుంది. టోర్నీలో ఓటమినే ఎరుగని టీమ్‌ఇండియా, ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా తుదిపోరులో తలపడనున్నాయి. లక్షా ముప్పై వేల మంది అభిమానులు, ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు, అసోం ముఖ్యమంత్రులతోపాటు అతిరతమహారథులు ఈ మెగా ఫైనల్ కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 6 వేలకుపైగా మంది సిబ్బందిని మోహరించింది. స్టేడియంతోపాటు ఆటగాళ్లు బసచేస్తున్న హోటళ్లు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తారని అహ్మదాబాద్ కమిషనర్ జీఎస్ మాలిక్ చెప్పారు. వీరిలో గుజరాత్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), హోమ్‌గార్డులు, ఇతర ఇబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నామని తెలిపారు.
Securities and Police Officers at Narendra Modi stadium in Final of this World Cup 2023: (PTI)
- More than 6000 security personnel.
- 4 senior IPS, IG, DIG.
- 23 DCP.
- 39 assistant commissioner of police.
- 92 police inspectors.
- NDRF teams.
- 10 teams of Bomb disposal squad. pic.twitter.com/sMoTvgV1z4
— CricketMAN2 (@ImTanujSingh) November 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)