ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అమ్మాయి పసిడి పతకం సాధించింది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది.

ఛాంపియన్ గా నిలిచిన జ్యోతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రశంసలు కురిపించారు. 'థాయ్‌లాండ్ లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జ్యోతికి అభినందనలు. నీవు మేమంతా గర్వపడేలా చేశావు' అని జగన్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపడుతున్న ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా బెస్ట్ విషెస్ చెప్పారు.

CM Jagan Congratulates Jyothi

 

Here's CM Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)