ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల వీరుడు క్రిస్ గేల్.. ఈ ఏడాది (2022) ఐపీఎల్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఫామ్‌ లేమి, వయో భారం రిత్యా అతను ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్‌ను బట్టి చూస్తే అతను ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వర్క్ జస్ట్ స్టార్ట్.. లెట్స్ గో.. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ప్రిపరేషన్స్ మొదలెట్టేశా.. అంటూ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను గేల్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌ చూసిన అతని అభిమానులు.. బాస్‌ విల్‌ బి బ్యాక్‌ అంటూ తెగ సంబురపడిపోతున్నారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో గేల్‌తో పాటు మిస్టర్ 360 డిగ్రీస్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మెరుపులు లేకపోవడంతో అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. తాజాగా గేల్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ విషయంపై క్లూ ఇవ్వడంతో, ఏబీ అభిమానులు కూడా తమ ఫేవరెట్‌ క్రికెటర్‌ రీఎంట్రీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు ఏబీ తన ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గేల్‌ సైతం టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత అన్ని క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాడన్న ప్రచారం జోరుగా సాగింది. యూనివర్సల్‌ బాస్‌.. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 142 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4965 పరుగులు చేశాడు. ఇందులో 405 ఫోర్లు, 357 సిక్సర్లు ఉన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)