ప్రపంచకప్‌-2023 రెండో సెమీ ఫైనల్‌.. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సౌతాఫ్రికా,ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్‌ సాధించడం‍లో డేవిడ్‌ మిల్లర్‌ కీలక​ పాత్ర పోషించాడు.మిల్లర్‌ వీరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్‌ స్కోర్‌ను అందించాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను మిల్లర్‌, క్లాసెన్‌(47) అదుకున్నారు. క్లాసెన్‌ ఔటైన తర్వాత మిల్లర్‌ పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. కాగా ప్రపంచకప్ 2023లో ఇది మిల్లర్ కు ఫస్ట్ సెంచరీ.

David Miller (Photo-X)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)