ఆస్ట్రేలియా వెటరన్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న తొలి మ్యాచ్‌ వార్నర్‌ టీ20 కెరీర్‌లో 100వది. ఇటీవలే వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన 37 ఏళ్ల వార్నర్‌ ఇప్పటివరకు 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు.

వార్నర్‌కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌, టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి మాత్రమే సాధించారు. రాస్‌ టేలర్‌ 112 టెస్ట్‌లు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడగా.. కోహ్లి 113 టెస్ట్‌లు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు.వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన వార్నర్‌.. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 70 పరుగులు చేసి అల్జరీ జోసఫ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)