యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజైన (Ashes 1st Test 2021 Day 3) నేడు ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా గాళ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ (England cricket Fan Proposes to Girlfriend) చేశాడు. మొదట అతడి వంక ఆశ్చర్యంగా చూసిన అమ్మాయి.. అనుమతి ఇచ్చేందుకు ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. ఆ వెంటనే ముద్దులు, కౌగిలింతలతో స్టేడియం (Cute Proposal Video Goes Viral) హోరెత్తిపోయింది. మ్యాచ్‌ను చిత్రీకరిస్తున్న కెమెరాలు ఒక్కసారిగా అటువైపు తిరిగాయి. స్టాండ్స్‌లోని అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహపరిచారు. కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలిపారు.

మైఖేల్ అనే యువకుడు మోకాళ్లపై కూర్చుని టోరీ అనే యువతిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె క్షణకాలం పాటు నమ్మలేకపోయింది. ఆ వెంటనే తేరుకుని ఓకే చెప్పడంతో అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే తన చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికి తొడిగాడు. వారి చుట్టూ ఉన్న అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహ పరచడంతో స్టాండ్స్ కేరింతలతో దద్దరిల్లింది. అయితే యాషెస్ సందర్భంగా గబ్బాలో ఇలాంటి ప్రపోజల్ రావడం ఇదే తొలిసారి కాదు. 2017లోనూ ఓ జంట ఇలానే ప్రపోజ్ చేసుకుని తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)