2024లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌కు ఈ సారి అమెరికా వేదిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు 2024 ప్రపంచ కప్‌ ఆతిథ్య హక్కులను యూఎస్‌ఏ క్రికెట్‌తో పాటు క్రికెట్‌ వెస్టిండీస్‌లకు సంయుక్తంగా కట్టబెట్టే యోచనలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఉన్నట్లు సమాచారం. 2028 ఒలింపిక్స్‌ లాస్‌ ఏంజెలిస్‌లో జరగనుండటం... అందులో క్రికెట్‌ను చేర్చాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి ఐసీసీ ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేసింది.

అందులో భాగంగా 2024 టి20 ప్రపంచకప్‌ను అమెరికాలో విజయవంతంగా నిర్వహిస్తే... 2028 విశ్వ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ఐసీసీ భావిస్తోంది. అయితే ప్రపంచ కప్‌ మ్యాచ్‌లన్నింటినీ అమెరికాలోనే నిర్వహించడకుండా... కరీబియన్‌ దీవుల్లోనూ నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే 2014 టి20 ప్రపంచకప్‌ తర్వాత మరో ఐసీసీ మెగా ఈవెంట్‌ భారత్, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌ దేశాల్లో కాకుండా మరో దేశంలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ కథనాన్ని పీటీఐ ప్రచురించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)