World Cup 2023: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్ రచిన్‌ రవీంద్ర, పిన్న వయసులో వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు

న్యూజిలాండ్‌ యువ కెరటం రచిన్‌ రవీంద్ర.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలుకొట్టాడు. శ్రీలంకతో పోరులో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి పెవిలియన్‌ చేరిన రచిన్‌ పిన్న వయసులో వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

World Cup 2023: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్ రచిన్‌ రవీంద్ర, పిన్న వయసులో వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు
Rachin Ravindra (Photo-ANI)

న్యూజిలాండ్‌ యువ కెరటం రచిన్‌ రవీంద్ర.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలుకొట్టాడు. శ్రీలంకతో పోరులో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి పెవిలియన్‌ చేరిన రచిన్‌ పిన్న వయసులో వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.మెగాటోర్నీలో ఓపెనర్‌గా బరిలోకి దిగి దంచికొడుతున్న రచిన్‌ రవీంద్ర 565 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా 25 ఏండ్లు నిండక ముందు ఓ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో 1996 వన్డే ప్రపంచకప్‌లో సచిన్‌ 523 పరుగులు చేయగా.. ఇప్పుడు రచిన్‌ 23 ఏండ్ల వయసులో ఆ మార్క్‌ దాటి అగ్రస్థానానికి చేరాడు.

Rachin Ravindra (Photo-ANI)

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 09, 2023 08:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).