ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య బుధవారం రాత్రి చినస్వామి స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపిన సంగతి విదితమే. మ్యాచ్ టైగా ముగియగా సూపర్ ఓవర్ అవసరమయింది. చివరకు రెండో సూపర్ ఓవర్లో అఫ్గాన్ ను భారత్ జట్టు ఓడించింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్ ఒకవైపు అయితే.. మ్యాచ్ చివరిలో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద చేసిన ఫీల్డింగ్ మరో అద్భుతమని చెప్పొచ్చు.

నజీబుల్లా కొట్టిన తీరుకు అందరూ సిక్స్ అనుకున్నారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లీ.. క్యాచ్ అందుకొనే ప్రయత్నం చేశాడు. అప్పటికే సమయం దాటిపోవటంతో బాల్ బౌండరీ లైన్ అవతలపడే సమయంలో గాల్లోకి ఎగిరి బాల్ ను మైదానంలోకి నెట్టేశాడు. దీంతో ఆరు పరుగులు వస్తాయనుకున్న అఫ్గాన్ బ్యాటర్ కు కోహ్లీ అద్భత ఫీల్డింగ్ తో ఒక్క పరుగుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కోహ్లీ ఫీల్డింగ్ తో బెంగళూరు స్టేడియంలోని ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)