సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ స్టార్ సర్ఫరాజ్‌ ఖాన్‌ .. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం మ్యాచ్‌ అన్న విషయాన్ని మరిచిపోయి యధేచ్ఛగా షాట్లు ఆడాడు. రోహిత్‌ శర్మ(131) అవుటైన తర్వాత అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు సర్ఫరాజ్‌.

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 26 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ 48 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. సర్ఫరాజ్‌ కేవలం​ 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల 82వ ఓవర్లో రనౌటయ్యాడు.అరంగేట్రంలోనే మెరుపు అర్ధ శతకం సాధించిన ఈ ముంబై బ్యాటర్‌ రనౌట్‌గా వెనుదిరగడం అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది.  జడ్డూ మీద కోపంతో క్యాప్‌ తీసి నేలకేసి కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ, సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌట్ కావడంపై అసహనం, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)