ఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. 2017 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో భారత్ బరిలోకి దిగగా 2012లో చివరి ద్వైపాక్షిక మ్యాచ్ ఆడాయి ఇరు జట్లు. కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే బరిలోకి దిగుతున్నాయి భారత్, పాక్ జట్లు.

ఇక టాస్ గెలిచిన బ్యాటింగ్ దిగింది పాకిస్థాన్. ఈ సందర్భంగా ఓపెనర్‌గా వచ్చిన బాబర్ అజామ్‌తో ముచ్చట్లు పెట్టాడు విరాట్ కోహ్లీ(Virat Kohli Pats Babar Azam). బాబర్‌ను అభినందిస్తు కనిపించగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు ఓ లుక్కేండి..

ఛాంపియన్స్‌ ట్రోఫీలో కీలక ఫైట్.. భారత్ వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌, ఇప్పటివరకు ఛాంపియన్స్‌ ట్రోఫిలో పై చేయి ఎవరిదో తెలుసా, 2017 ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకునేనా! 

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాయాది దేశాలైన భారత్ తో తలపడనుంది పాకిస్థాన్ . దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధింంచింది టీమిండియా. శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో మెరియగా రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్ రాణించారు.

IND vs PAK ICC Champions Trophy 2025, Virat and Babar Azam video goes viral

Babar X Kohli 🫶❤️‍🩹#PAKvsIND #INDvsPAK #PAKvIND #iccchampionstrophy2025 #ChampionsTrophy pic.twitter.com/Lv9MMVZWKB

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)