ఐపీఎల్-2022లో వరుస ఓటుముల బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు మరోసారి భారీ జరిమానా పడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు అతడిపై రూ. 24 లక్షల జరిమానా ఐపీఎల్ నిర్వహకులు విధించారు. అతడితో పాటు జట్టు సభ్యలుకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ స్లో ఓవర్‌రేట్ కారణంగా ఫైన్‌ను ఎదుర్కొన్నాడు. ఇక రోహిత్ మూడో సారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటాడు.
Mumbai Indians skipper Rohit Sharma fined Rs 24 lakh for slow over rate against Punjab Kingshttps://t.co/lzVXwshwXe
— Firstpost Sports (@FirstpostSports) April 14, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)