ఐపీఎల్‌-2022లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ వేసిన కుల్ధీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో.. శ్రేయస్‌ అయ్యర్‌ కట్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుంది. ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ పంత్‌ అద్భుతమైన 'లో' క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకున్నాడు. వెంటనే క్యాచ్‌కు పంత్‌ అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు.అయితే రిప్లేలో బ్యాట్‌ను బంతి క్లియర్‌గా తాకినట్లు కనిపించింది. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అద్భుతంగా ఆడుతున్న అయ్యర్‌ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక పంత్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. "స్పైడర్‌మ్యాన్‌లా క్యాచ్‌ పట్టావు" అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)