వ‌రుస‌గా నాలుగు ఓట‌ముల త‌ర్వాత ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 23 ర‌న్స్ తేడాతో చెన్నై గెలిచింది. ఫీల్డింగ్ స‌మ‌యంలో చెన్నై ప్లేయ‌ర్స్ కేక పుట్టించారు. అంబ‌టి రాయుడు 16వ ఓవ‌ర్‌లో అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. కుడి వైపు డైవ్ చేస్తూ వంటి చేతిలో ఆకాశ్ దీప్ ఇచ్చిన క్యాచ్‌ను ప‌ట్టేశాడు. ర‌వీంద్ర జ‌డేజా ఆ ఓవ‌ర్‌లో బౌలింగ్ చేశాడు. గుడ్‌లెన్త్ బాల్‌ను షార్ట్‌గా బౌల్ చేయ‌డంతో అది కాస్త ఆగి వ‌చ్చింది. ఆకాశ్ దీప్ దాన్ని పుష్ చేశాడు. షార్ట్ క‌వ‌ర్‌లో ఉన్న రాయుడు.. ఫుల్ లెన్త్ డైవ్ చేస్తూ క్యాచ్ ప‌ట్టుకున్నాడు. ఆ క్యాచ్ వీడియో అభిమానుల మీకోసం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)