ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ నంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్‌ను కిందకు దించాడు భారత యువకెరటం. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్‌ అగ్రస్థానాని​కి ఎగబాకి, బాబర్‌ను రెండో ప్లేస్‌కు నెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 219 పరుగులు చేసిన గిల్‌.. బాబర్‌ కంటే ఆరు రేటింగ్‌ పాయింట్లు (830) అధికంగా సాధించి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. సచిన్‌, ధోని, కోహ్లి తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌కు చేరిన భారత బ్యాటర్‌ గిలే కావడం విశేషం.

గిల్‌తో పాటు విరాట్‌ కోహ్లి కూడా తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. వరల్డ్‌కప్‌లో ప్రదర్శనల కారణంగా తాజా ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు ఏర్పడింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో భారీగా స్థానచలనాలు జరిగాయి. డికాక్‌ (మూడో స్థానం), శ్రేయస్‌ (18), ఫకర్‌ జమాన్‌ (11), ఇబ్రహీం జద్రాన్‌ (12) తమతమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు.

Here's News

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)