వన్డేప్రపంచకప్‌-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించిన భారత్‌.. ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.వరల్డ్‌కప్‌ 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌ బ్యాటర్లలో డార్లీ మిచెల్‌(134) విరోచిత శతకంతో పోరాడినప్పటికీ.. తన జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయాడు. మిచెల్‌తో పాటు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(69) పర్వాలేదన్పించాడు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ అద్భుమైన ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్‌ పతనాన్ని శాసించాడు. ఓవరాల్‌గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. వీడియో ఇదిగో..

Mohammed Shami (Photo-X)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)