NewDelhi, September 30: టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో మిగిలిన రెండు టీ20లతో పాటు వచ్చే నెల ఆస్ట్రేలియాతో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఆయనను దూరం పెట్టారు. బుమ్రా స్థానంలో హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు సిరాజ్ ను ఎంపిక చేసినట్టు ఒక ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది. మరోవైపు 3 టీ20ల సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్ ఆదివారం నాడు గువాహటిలో జరుగుతుంది.
🚨 NEWS 🚨: Mohd. Siraj replaces injured Jasprit Bumrah in T20I squad. #TeamIndia | #INDvSA
More Details 🔽https://t.co/o1HvH9XqcI
— BCCI (@BCCI) September 30, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)