ప్రస్తుతం ధోనీ 2021 ఐపీఎల్‎లో చెన్నై సారథి బిజీగా ఉన్నాడు. నేడు ముంబై వాంఖడే స్టేడియంలో కోల్‎కతా నైట్ రైడర్స్‎తో చెన్నై జట్టు తలపడనుంది.బయో బబుల్‌ నిబంధనల నడుమ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే, ప్లే ఆఫ్స్‌ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే.

మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సూపర్‌కింగ్స్‌ లీగ్‌ దశలోనే వెనుదిరగడం టోర్నీ చరిత్రలో అదే మొదటిసారి. టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన పడటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక టోర్నీ నుంచి జట్టు నిష్క్రమించిన తర్వాత ధోని కుటుంబానికే సమయం కేటాయించాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)