టీ20 వరల్డ్‌కప్-2022లో సూపర్-12 గ్రూప్-1లో భాగంగా న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి జోరుమీదున్న విలియమ్సన్ సేన ఈ మ్యాచ్ వర్షార్ఫణం కావడంతో ఈ ప్రభావం సెమీస్ చేరే అవకాశాలను దెబ్బ తీస్తుందని ఆ జట్టు భయపడుతుంది.
మరోవైపు తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ మ్యాచ్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి సంచలనం నమోదు చేయాలని నబీ సేన భావించింది. అయితే వారి ఆశలపై కూడా వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లు చెరో పాయింట్‌తో సర్దుకున్నాయి.
Rain plays spoilsport at the MCG 🌧
Afghanistan and New Zealand share points after the match is called off!#T20WorldCup | #NZvAFG pic.twitter.com/2Z8TmuX1gz
— ICC (@ICC) October 26, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)