వన్డే వరల్డ్ కప్(ODI World Cup)కు సంబంధించి ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ప్రకటించింది. ఈసారి 10 లక్షల డాలర్లను కేటాయించినట్టు ఐసీసీ తెలిపింది. ట్రోఫీ విజేతకు 4 లక్షల డాలర్లు అంటే రూ. 33 కోట్లు, రన్నరప్ జట్టుకు 2 లక్షల డాలర్లు అంటే రూ. 16.5 కోట్లు కానుకగా దక్కనున్నాయి.
సెమీఫైనల్లో ఓడిపోయిన రెండు టీమ్‌లకు తలా రూ. 13 కోట్లు ముడతాయని ఐసీసీ తెలిపింది. సూపర్ 6 దశలోనే ఇంటిదారి పట్టిన జట్లకు రూ.4.9 కోట్లు ఇవ్వనున్నారు. అంతేకాదు గ్రూప్ దశలో గెలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. గ్రూప్ స్టేజ్‌లో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు రూ.33 లక్షలు లభిస్తాయని ఐసీసీ వెల్లడించింది. 2019లో చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు రూ. 39 కోట్లు ప్రైజ్‌మనీగా దక్కాయి. అక్టోబర్ 5న భారత గడ్డపై వన్డే ప్రపంచ కప్ మొదలవ్వనుంది.
Here's ICC Tweet
Who will take home the top #CWC23 prize? 💰
More: https://t.co/Ubo4iRkbsI pic.twitter.com/RGFQGyUcdq
— ICC (@ICC) September 25, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)