ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా లహోర్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో కివీ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రచిన్ రవీంద్ర నుదిటికి బంతికి బలంగా తాకింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవ‌ర్ వేసిన‌ స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో మూడో బంతిని పాక్ బ్యాట‌ర్ కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న‌ ర‌చిన్ బంతిని అందుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి గ‌మ‌నాన్ని స‌రిగ్గా అంచ‌నా వేయ‌డంలో ర‌చిన్ విఫ‌ల‌మం కావ‌డంతో.. ఆ బంతి నేరుగా వెళ్లి అత‌డి నుదిటికి తాకింది.

ఇన్నాళ్లకు ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ, కటక్‌ వన్టేలో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలే! అత్యధిక సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా రికార్డు

దీంతో అత‌డికి తీవ్ర ర‌క్త‌స్రావ‌మైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు వల్ల బంతి సరిగా కనిపించకపోవడంతో ఈ ఘటన జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇక గాయ‌ప‌డిన ర‌చిన్‌ను వెంట‌నే అస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది.

Rachin Ravindra Injury: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)