దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రింకు సింగ్ (Rinku Singh) (68) అర్ధ శతకంతో అలరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఆడిన ఓ భారీ షాట్‌కు మీడియా బాక్స్‌ అద్దం పగిలింది. మార్‌క్రమ్ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్స్‌లతో అలరించాడు. అయిదో బంతిని ముందుకొచ్చి వైడ్‌ లాంగ్‌లో స్టాండ్స్‌లో కొట్టిన రింకు.. తర్వాత బంతిని బౌలర్‌ తలమీదుగా బాదడంతో మీడియా బాక్స్‌ అద్దం పగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, అద్దం పగిలినందుకు క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌, సో క్యూట్‌ రింకూ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు

Heres' Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)