టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 2012, 2017, 2018లో కింగ్ ఈ పురస్కారాలు అందుకున్నాడు. తాజాగా మరోసారి అవార్డును తన కైవసం చేసుకున్న కోహ్లి.. ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు.క్రికెట్ ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా కూడా కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్, మాజీ క్రికెటర్ ఏబీడీ గతంలో మూడుసార్లు ఈ అవార్డు గెలిచాడు.
Here's News
Player of the tournament at the ICC Men’s @cricketworldcup 2023 😎
The extraordinary India batter has been awarded the ICC Men’s ODI Cricketer of the Year 💥 https://t.co/Ea4KJZMImE
— ICC (@ICC) January 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)