విండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ త్రో విసిరే సమయంలో బంతిని బ్యాటర్‌వైపు ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లు రుజువు కావడంతో బ్రాత్‌వైట్‌ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్‌ నిర్ణయం తీసుకున్నాడు. విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్‌షైర్‌, డెర్బీషైర్‌ మధ్య మ్యాచ్‌ జరిగే సమయంలో డెర్బీషైర్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ బ్రాత్‌వైట్‌ వేశాడు. 34 పరుగులతో క్రీజులో వేన్‌ మాడ్సన్‌ ఉన్నాడు. ఆ ఓవర్‌ మూడో బంతిని బ్రాత్‌వైట్‌ యార్కర్‌ వేయగా.. మాడ్సన్‌ బంతిని ముందుకు పుష్‌ చేశాడు. బంతిని అందుకున్న బ్రాత్‌వైట్‌ త్రో విసిరే ప్రయత్నం చేయగా.. బంతి మాడ్సన్‌ పాదానికి గట్టిగా తగిలింది. నాన్‌స్ట్రైకర్‌ కాల్‌ ఇవ్వడంతో సింగిల్‌ పూర్తి చేశారు. బ్రాత్‌వైట్‌ కూడా మాడ్సన్‌ను క్షమాపణ కోరాడు.

ఇదంతా గమనించిన ఫీల్డ్‌ అంపైర్‌ బ్రాత్‌వైట్ చేసింది తప్పని.. అందుకు శిక్షగా ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపాడు. లెగ్‌ అంపైర్‌తో విషయం చర్చించాకా బంతిని కూడా డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్‌ను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా వచ్చాయి. ఆ ఓవర్‌లో ఎనిమిది పరుగులు సహా ఐదు పెనాల్టీ పరుగులతో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే డెర్బీషైర్‌ వార్విక్‌షైర్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)