భారత-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. బుమ్రా (19), కుల్దీప్ (27) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. టీమిండియా బ్యాటింగ్ సంచలనం యశస్వీ జైస్వాల్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వీరవిహారం చేశాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసిన జైస్వాల్.. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరో ఫిఫ్టీ (57) చేశాడు. అర్థ సెంచరీ చేసే క్రమంలో జైస్వాల్.. ఐదు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు. తద్వారా జైస్వాల్.. టెస్టులలో వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్నాడు. బంతిని చూడకుండానే భారీ సిక్సర్ బాదిన శుబ్‌మన్ గిల్, బిత్తరపోయిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, వీడియో ఇదిగో..
టెస్టులలో భారత్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన వారిలో జైస్వాల్ రెండోవాడిగా రికార్డు నెలకొల్పాడు. 9వ టెస్టు ఆడుతున్న జైస్వాల్.. 16 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకోగా వినోద్ కాంబ్లీ.. 12 టెస్టులలో 14 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగులు పూర్తిచేశాడు. జైస్వాల్.. పుజారా (18 ఇన్నింగ్స్), మయాంక్ అగర్వాల్ (19), సునీల్ గవాస్కర్ (11 టెస్టులు, 21 ఇన్నింగ్స్) రికార్డులను బ్రేక్ చేశాడు.
Here's News
Fastest to 1000 Test runs, in terms of matches:
7 - Don Bradman
9 - Herbert Sutcliffe
9 - Everton Weekes
9 - George Headley
9 - YASHASVI JAISWAL
Jaiswal among the legendary names! #INDvsENG pic.twitter.com/omR4w4ulLz
— Bharath Seervi (@SeerviBharath) March 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)