ఒలింపిక్ స్వర్ణ పతకంతో పాటు క్యాలెండర్ సంవత్సరంలో ‘గోల్డెన్ స్లామ్’ సాధించాలనే లక్ష్యంతో టోక్యోకు వచ్చిన టెన్నిస్ సెర్బియా ఆటగాడు వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆశలు అడియాసలు అయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఓడిన అతను ... మూడో స్థానం కోసం ఆడాల్సిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ కూడా ఆడకుండానే తప్పుకున్నాడు. దాంతో అతనికి ఈ ఒలింపిక్స్‌లో శూన్య హస్తం దక్కింది.
శనివారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో పాబ్లో కారెనో బుస్టా (స్పెయిన్) 6–4, 6–7 (6/8), 6–3తో జొకోవిచ్‌ను ఓడించాడు. మ్యాచ్‌లో పలుమార్లు జొకోవిచ్ సహనం కోల్పోయాడు. ఒకసారి రాకెట్‌ను ప్రేక్షకుల్లోకి విసిరేసిన అతను, మరోసారి తన రాకెట్‌తో నెట్‌పై బలంగా పదే పదే కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
If djokovic throwing and smashing his racquet in a third place match just for losing points isn’t the lack of the Olympic spirit idk what is . Losing your shit does not suit a world champion. That’s why he’ll never reach Federer and Nadal’s level.#TokyoOlympics2020 pic.twitter.com/mliSmPZYdz
— Nilay (@wyanilay) July 31, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)