వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్ జొకోవిచ్ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్) చేతిలో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బి యా) ఓడిపోయాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన పోరులో అల్‌కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్‌పై నెగ్గాడు.
2022లో యూఎస్ ఓపెన్ సాధించిన అల్‌కరాజ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి జోరు మీదున్న 36 ఏళ్ల జొకోవిచ్ మూడో గ్రాండ్‌స్లామ్ తుది పోరులో ఓటమితో నిరాశగా నిష్క్రమించాడు. విజేత అల్‌కరాజ్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జొకో విచ్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Here's Video
The Spanish sensation has done it 🇪🇸@carlosalcaraz triumphs over Novak Djokovic, 1-6, 7-6(6), 6-1, 3-6, 6-4 in an all-time classic#Wimbledon pic.twitter.com/sPGLXr2k99
— Wimbledon (@Wimbledon) July 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)