గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చేరుకున్నారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం జి.పెదపూడి చేరుకున్నారు. పెదపూడిలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వర్షంలోనే వరద బాధితుల వద్దకు సీఎం చేరుకున్నారు. గోదావరి వరద బాధితులతో సీఎం వైయస్ జగన్ ముచ్చటించారు. వరదల వల్ల కలిగిన నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమాల గురించి నేరుగా బాధితులనే అడిగి తెలుసుకున్నారు.. అనంతరం పెదపూడి ఫెర్రీ నుంచి పంటుపై లంక గ్రామాలకు చేరుకున్న సీఎం.. వరద బాధితులను కలుసుకొని.. వారిని పరామర్శించారు.
వరద బాధితులకు సీఎం పరామర్శ. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్. భారీ వర్షంలోనూ కొనసాగుతున్న సీఎం పర్యటన. పి. గన్నవరం మండలం పెదపూడి, లంక గ్రామాల్లోని బాధితులతో మాట్లాడిన సీఎం. #YSJaganCares pic.twitter.com/OMI2P9wgsq
— YSR Congress Party (@YSRCParty) July 26, 2022
భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వర్షంలోనే వరద బాధితుల వద్దకు సీఎం. పంటు పై లంక గ్రామాలకు చేరుకున్న సీఎం.#CMYSJagan #YSJaganCares pic.twitter.com/C6LgBcLY8P
— YSR Congress Party (@YSRCParty) July 26, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)