కాకినాడ జిల్లాలోని తునిలో తన పర్యటన సందర్భంగా CM Jagan.. మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. జనాల మధ్య చంటిబిడ్డతో ఉన్న ఓ తల్లిని గుర్తించి.. తన కాన్వాయ్‌ను ఆపించి దిగారు. ఆ తల్లి వివరాలు అడిగి తెలుసుకుని.. ఆమె కష్టానికి చలించిపోయారు.ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజకు ఓ కొడుకు ఉన్నాడు. ఆ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయం కోసం ఆమె సీఎం జగన్‌ను కలవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే చంటిబిడ్డను సీఎం కాన్వాయ్‌కు కనిపించేలా ప్రయత్నించింది.

అది గమనించిన సీఎం జగన్‌.. కాన్వాయ్‌ను ఆపించారు. ఆ తల్లీబిడ్డలను పిలిపించుకుని సమస్య తెలుసుకున్నారు. తన బిడ్డ ఆరోగ్య పరిస్ధితిని సీఎం జగన్‌కు వివరించి ఆదుకోవాలని తనూజ కోరడంతో ఆయన సత్వరమే స్పందించారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌కు సమస్యను పరిష్కరించాలని ఆదేశించి.. అప్పటికప్పుడే ఆమెకు సాయం అందేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)